Thursday, March 23, 2017

దేహమేరా దేవాలయం

చిత్రం : దేవాలయం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు పల్లవి :


దేహో దేవాలయో ప్రోక్తో
జీవో దేవస్సనాతనః


దేహమేరా దేవాలయం
దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం


నేనే బ్రహ్మ...  నేనే విష్ణువు
నేనే బ్రహ్మ...  నేనే విష్ణువు
నేనే శివుడై నిలబడితే....
ఏ అర్హత నాకుండాలీ?
ఏ అధికారం కావాలీ?


అహం బ్రహ్మస్మి...  అహం బ్రహ్మస్మి
దేహమేరా...  దేవాలయం చరణం 1 : ఆత్మాత్వం గిరిజా మతిః
పరిజనాః ప్రాణః శరీరం గృహం


అనలేదా అది శంకరుడు...
అంతకు మించిన వారా మీరు?


ఆడంబరమూ బాహ్యవేశము
అర్బాటలే మీ మతమా
అస్థికులంటే మీరేనా
అస్థికలంటే శరీరమా


శిలా గోపురం ఆలయమా
శఠగోపురమే అర్చనమా


దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం చరణం 2 : అద్వేష్టా సర్వ భూతానాం
మైత్రః కరుణ యేవచ
నిర్మమో నిరహంకారః
నమ దుఃఖ సుఖ క్షమీ


సంతుష్ట స్సతతం యెగీ
యదాత్మా దృఢ నిశ్చయః


మై అర్పిత మనో బుద్దిర్యోహో
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2136

ఎందుకయ్యా నవ్వుతావు

చిత్రం : చిన్ననాటి స్నేహితులు (1971)
సంగీతం : టి. వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీలపల్లవి :


ఎందుకయ్యా నవ్వుతావు... ఎవరు సుఖపడినారనీ...
ఎందుకయ్యా.... ఆ... ఆ
నవ్వుకోరా తనివితీరా...  ఎవ్వరేమైతేమనీ నవ్వుకోరా..ఆ చరణం 1 : నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే
నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే


నిండు వెన్నెల బాటలో
కన్నీటి చీకటి నింపినావే


ఎందుకయ్యా నవ్వుతావు... ఎవరు సుఖపడినారనీ...
ఎందుకయ్యా.... ఆ... ఆచరణం 2 : చావు బ్రతుకుల ఉందిరా... నిను చల్లగా కాపాడు దేవతా
చావు బ్రతుకుల ఉందిరా... నిను చల్లగా కాపాడు దేవతా..
ఆమే నీడయే లేని నాడు... ఆగిపోవును మనకథా
ఆగిపోవును..... మనకథా... ఆ


ఎందుకయ్యా నవ్వుతావు... ఎవరు సుఖపడినారనీ...
ఎందుకయ్యా.... ఆ... ఆ


చరణం 3 : 


నిన్ను పెంచిన కల్పవల్లీ... నిండుగా బ్రతకాలనీ
వేడుకోరా వెంకటేశుని... వేడుకోరా విశ్వనాథునీ 

వేడుకోరా... వేడుకోరా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18043

నోములు పండగా

చిత్రం : చిన్ననాటి స్నేహితులు (1971)
సంగీతం : టి. వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల, వసంతపల్లవి :నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా


నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా చరణం 1 : చీకటినే వెలిగించే దివ్వెవు కావాలనీ...
చింతలు తొలగించే చిరునవ్వువు కావాలనీ
చీకటినే వెలిగించే దివ్వెవు కావాలనీ..
చింతలు తొలగించే చిరునవ్వువు కావాలనీ


కన్నతల్లి ఎన్ని కలలు కన్నదో..
ఎన్నెన్ని దేవతలకు మొక్కుకున్నదో 

పరమాత్మకు ప్రతిరూపం నీవనీ..
పసిడి కళల మణిదీపం నీవనీ..
పరమాత్మకు ప్రతిరూపం నీవనీ..
పసిడి కళల మణిదీపం నీవనీ..

కలలుగనీ నినుగన్న కన్నతల్లి మనసు
కడుపులో పెరిగిన ఓ కన్నా... నీకేతెలుసు
నాకన్నా నీకే తెలుసు 


నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా చరణం 2 : పాలిచ్చీ పాలించే ఈ తల్లీ
తల్లికాదు నీపాలి కల్పవల్లీ    


ఈ వరాల మొలకను... ఈ జాబిలి తునకను
ఈ వరాల మొలకను... ఈ జాబిలి తునకను
దీవనగా మాకిచ్చిన ఆ తల్లి...  తల్లికాదు మాపాలి కల్పవల్లి
తల్లికాదు మాపాలి కల్పవల్లినోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=28307

కలిసే మనసుల తొలి గీతం

చిత్రం : చేసిన బాసలు (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీలపల్లవి :


ఓహో..ఓ..ఓహోహో..ఓ ఏహే..ఓహోహో.ఏహేహే


కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం


ఆమని వలపుల కమ్మని కథ... ఏమని తెలుపను ఎదలో సొద
రాగాలేవో నాలో రేగే...  వయ్యరాలే ఉయ్యాలూగే


కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం 


అనురాగం ఆలాపనగా...  ప్రతి జన్మకు అది దీవెనగా
నే చేసిన బాసల లయలో...  శ్రుతి చేసిన వీణల జతగా
ఈ సంగమే మన సరిగమగా...  పలికే జీవనరాగంలో
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం


ఆమని వలపుల కమ్మని కథ... ఏమని తెలుపను ఎదలొ సొద
రాగాలేవో నాలో రేగే...  వయ్యరాలే ఉయ్యాలూగే
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం చరణం 1 : ఈ తీరని ఆవేదనలే... ఒక తీయని ఆరాధనగా
నీ కౌగిలి నా కోవెలగా...  నా బ్రతుకే నీ హారతిగా
శృంగారంలో సింధురాలే చిలికే సంధ్యా రాగంలోకలిసే మనసుల తొలి గీతం.... ఎన్నో జన్మల సంగీతం
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2726

Wednesday, March 22, 2017

ఏ వేళనైన ఒకే కోరికా

చిత్రం : చండీప్రియ (1980)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :


ఏ వేళనైన ఒకే కోరికా... ఏ పువులైన ఒకే మాలిక
ఇలాగే పాడాలి... కలకాలం
ఇలాగే పాడాలి... కలకాలం


ఏ వేళనైన ఒకే కోరికా... ఏ పువులైన ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
చరణం 1 : అరవిరిసే కనులే...  కమలాలు
ముసురుకునే కురులే...  బ్రమరాలుమిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
దిగిరావా నీలాల గగనాలు... 


ఏ వేళనైన ఒకే కోరికా... ఏ పూవులైన ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
చరణం 2 : కెహెతా హై ప్యాసా మన్ మేరే సాజన్
ఖిల్తా రహే అబ్ మై ఆజ్ సావన్


మెరిసే నీ నవ్వులే జల్లులైతే
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
పరువాలే శ్రావణ మేఘాలు 


ఏ వేళనైన... ఒకే కోరికా...
ఏ పూవులైన...  ఒకే మాలిక


యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్ 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2658

Monday, March 20, 2017

వెండి చందమామలు

చిత్రం : బావామరదళ్లు (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు పల్లవి :


వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు 


ఎండపూల జల్లులు ఎవరి కోసము?
ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
బంధమైన అందమైన బ్రతుకు కోసము వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు 


ఎండపూల జల్లులు ఎవరి కోసము?
ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
బంధమైన అందమైన బ్రతుకు కోసము  చరణం 1 :ఘడియలైన  కాలమంతా ఘడియైనా వీడలేని
ఘాఢమైన మమతలు పండే కౌగిలి కోసం 


మధువులైన మాటలన్నీ పెదవులైన ప్రేమలోనే
తీపి తీపి ముద్దులు కొసరే వలపుల కోసం


నవ్వే నక్షత్రాలు... రవ్వల చాందినీలు
పండినవే కలలు... అవి పరచిన పానుపులు


నీవు లేక నాకు రాని నిర కోసము...
నిన్ను తప్ప చూడలేని కలల కోసము


వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
అ... అహహ.. ఏహే.. ఆ... ఆ.. ఆ.. 
చరణం 2 :తనువులైన బంధమంతా క్షణమైనా వీడలేని
అందమైన ఆశలు పూసే ఆవని కోసం


పల్లవించు పాటలన్నీ వెలుగులైన నీడలలోనే
తోడు నేను ఉన్నానన్నా మమతల కోసం


వెన్నెల కార్తీకాలు... వెచ్చని ఏకాంతాలు
పిలిచే కోయిలలు... అవి కొసరే కోరికలు


నిన్ను తప్ప కోరుకోని మనసు కోసము...
నీవు నేను వేరు కాని మనువు కోసమువెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
ఎండపూల జల్లులు ఎవరి కోసము
ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
బంధమైన అందమైన బ్రతుకు కోసము 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2688

కొండల కోనల సూరీడు

చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  జానకి


పల్లవి :

జయము.. జయము.. దిగ్విజయము కలుగు
అంబ పలుకు జగదంబపలుకు... బెజవాడ కనకదుర్గ పలుకు
శ్రీశైలం బ్రమరాంబ పలుకు
జయము కలుగు.. శుభోజయము కలుగు


కొండల కోనల సూరీడు.... కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు

కొండల కోనల సూరీడు.... కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరుచరణం 1 :


ఆ.. ఆ.. ఆ.. ఆ..


ఆ మావిగుబురు... హెహె.. ఆ సింత సిగురు..హెహెహెహెహేయ్
ఆ ఎనక పిలిచేటి ఏరు...
పదవే... పదవే... పదవే.... పిలిచే పచ్చని బీడు
కదిలే గొత్తెల బారు 


ఆ... ఆ.. ఆ... ఆ...ఓ..ఓ..ఓ...చరణం 2 :


కొమ్మల రెమ్మల కదిలేనూ...  నెమ్మదిగా పిల్లగాలి
నల్లమలల పిల్లగాలి...


తోటకు సింతల సిగురుంది... పూతకు మావిడి పూవ్వుంది
లేత చింత చిగురల్లే... కోతకొచ్చిన వయసు

ఆ... ఆ... ఆ... ఆ...
పూతామావిపిందల్లే పూతకొచ్చిన పడుచు
ఆ... ఆ... ఆ... ఓ...
ఓ...ఓ...

ఊగు... దాన్ని లాగేవు కొంటే కోనంగు...
మత్తెక్కి చూసేవు నువ్వు... నిన్ను మక్కెలిరగ తన్నేరు చూడు
ఆ... ఆ... ఆ.. ఆ... ఓ... ఓ.. ఓ...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2088