చిత్రం: అడవి రాముడు (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఆమె:
ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..ఈ.. ఈ...
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి.. చలి చలి ఆఁహ్... చలి చలి
అతడు:
పారేసుకోవాలనారేసుకున్నావు.. అరె అరె అరె అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. ఈ.. ఈ..
నాకు ఉడుకెత్తి పోతోంది.. హరి హరి.. హరి హరి.. హరి హరి
ఆమె:
ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె అరె అరె అరె
చరణం 1:
ఆమె:
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
అతడు:
నా పాట ఈ పూట నీ పైటల.. దాచేసుకోనీ తొలిపొంగుల
ఆమె:
ఆఆఆ నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
అతడు:
ఏయ్...నా పాట ఈ పూట నీ పైటల.. దాచేసుకోనీ తొలిపొంగుల
ఆమె:
నీ చూపు సోకాలి...
అతడు:
నా ఊపిరాడాలి...
ఆమె:
హా.. నీ చూపు సోకాలి
అతడు:
నా ఊపిరాడాలి
ఆమె:
నీ జంట నా తీపి చలి మంట కావాలి
అతడు:
నీ వింత కౌవ్వింతకే.. కాగిపోవాలి
ఆమె:
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
అతడు:
నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి హరి హరి..ఏయ్... హరి హరి
చరణం 2:
అతడు:
నీ ఒంపులో సొంపులే హరివిల్లు..
నీ చూపులో రాపులే విరిజల్లు
ఆమె:
ఆఁ... నీ రాక నా వలపు ఏరువాక..
నీ తాక నీలిమబ్బు నా కోక...
అతడు:
నే రేగిపోవాలి
ఆమె:
నేనూగిపోవాలి
అతడు:
నే రేగిపోవాలి
ఆమె:
నేనూగిపోవాలి
అతడు:
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఆమె:
ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
అతడు:
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి..
ఆమె:
ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె.. ఆఁ అరె ఆఁ అరె ఆఁ అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి..హా.. చలి చలి..హా.. చలి చలి
అతడు:
పారేసుకోవాలనారేసుకున్నావు అరె..ఆ.. అరె..ఆ.. అరె..ఆ.. అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెత్తి పోతోంది.. హరి హరి.. హరి హరి.. హరి హరి
అతడు, ఆమె :
లాలాల లాలాలలలలలలల.. లాలాల లాలాలలలలలలల..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=735
No comments:
Post a Comment