Wednesday, July 25, 2012

ఏమో ఏమో ఇది


చిత్రం :  అగ్గి పిడుగు (1964)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం : ఘంటసాల, జానకి



పల్లవి:



ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది


ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది

ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది



హాయ్...

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది



చరణం 1:



కనులలో నీ కనులలో.. నా కలలే పొంగినవీ

కురులలో ముంగురులలో.. నా కోరికలూరినవీ


ఆహ.. ఆహ... ఆ..

వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది

చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది.. గిలిగింతగ తోచినది



ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది


చరణం 2:



ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు

అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు


ఆహ.. ఒహో.. ఆ..

నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. నను దోచివేయకు

మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు.. మంత్రించివేయకు


ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఆహ... ఆహ... ఆహ... హ... 

ఊహూహు.. హూ..హుహు.. 




No comments:

Post a Comment