Sunday, July 29, 2012

వానా వానా వందనం

చిత్రం :  అడవి దొంగ (1985) 

సంగీతం :  చక్రవర్తి 

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి: 


అ ఆ ఆ.. వానా వానా వందనం... 

ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం 

నీవే ముద్దుకు మూలధనం 

పడుచు గుండెలో గుప్తధనం 

ఇద్దరి వలపుల ఇంధనం 

ఎంత కురిసినా కాదనం 

ఏమి తడిసినా.. ఆ.. ఆ.. వద్దనం... ఈ దినం.. 


లల్లల్ల..లాలా.. లాలా.. 

అ ఆ ఆ.. వాన వాన వందనం... 

ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం 


చరణం 1: 


చలి పెంచే నీ చక్కదనం...  కౌగిట దూరే గాలి గుణం 

గాలి వానల కలిసి రేగుతూ.. ..కమ్ముకుపోతే యవ్వనం 



చినుకు చినుకులో చల్లదనం ...చిచ్చులు రేపే చిలిపితనం 

వద్దంటూనే వద్దకు చేరే ఒళ్లో ఉందీ పడుచుతనం 



మెరుపులు నీలో చూస్తుంటే... 

ఉరుములు నీలో పుడుతుంటే 

వాటేసుకొని తీర్చుకో... 

వానదేవుడి వలపు ఋణం...వాన దేవుడి వలపు ఋణం... 


అ ఆ ఆ.. వానా వానా వందనం... ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం 


చరణం 2: 


కసిగ ఉన్న కన్నెతనం... కలబడుతున్న కమ్మదనం 

చెప్పలేక నీ గుండ వేడిలో... హద్దుకుపోయిన ఆడతనం 



ముద్దుకు దొరికే తియ్యదనం .. ముచ్చట జరిగే చాటుతనం 

కోరి కోరి నీ పైట నీడలో.. నిద్దుర లేచిన కోడెతనం 



చినుకులు చిట పటమంటుంటే ..

చెమటలు చందనమౌతుంటే... 

చలి చలి పూజలు చెసుకో... 

శ్రావణమాసం శోభనం .. శ్రావణమాసం శోభనం 


అ ఆ ఆ వానా వానా వందనం... 

ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం 

నీవే ముద్దుకి మూలధనం.. 

పడుచు గుండెలో గుప్తధనం... 

ఇద్దరి వలపుల ఇంధనం.. 

ఎంత తడిచిన కాదనం... 

ఏమి తడిసిన వద్దనం... ఈ దినం.. 
లల్లల్ల..లాలా.. లాలా.. 

అ ఆ ఆ వానా వానా వందనం... 

ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9368

No comments:

Post a Comment