Thursday, August 2, 2012

సూర్యుడు చూస్తున్నాడు

చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

చరణం 1:

నిన్ను ఎలా నమ్మను? ఎలా నమ్మించను..?
ఆ ఆ..ప్రేమకు పునాది నమ్మకము..
అది నదీ ..సాగర సంగమము...

ఆ ఆ.. కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము...

అది వెలిగించని ప్రమిదలాంటిది...ఈ..ఈ..
వలచినప్పుడే వెలిగేది...

వెలిగిందా మరి? వలచావా మరి..
వెలిగిందా మరి? వలచావా మరి..
యెదలో ఏదో మెదిలింది..అది ప్రేమని నేడే తెలిసింది...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

చరణం 2:

ఏయ్.. వింటున్నావా?..

ఊ.. ఏమని వినమంటావ్?
ఆ..ఆ.. మనసుకు భాషే లేదన్నావు..మరి ఎవరి మాటలని వినమంటావు?
ఆ..ఆ..మనసు మూగగా వినపడుతోంది?
అది విన్నవాళ్ళకే భాషవుతుంది ...

అది పలికించని వీణ వంటిది...మీటి నప్పుడే పాటవుతుంది...
మిటేదెవరని...పాడేదేమని...
మిటేదెవరని...పాడేదేమని...
మాటా..మనసు ఒక్కటని..
అది మాయని చెరగని సత్యమని...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నా వాడూ...నేడు... రేపు... ఏనాడూ...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2690

No comments:

Post a Comment