Monday, August 27, 2012

దులపర బుల్లోడో

చిత్రం: అంతస్తులు (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: భానుమతి

పల్లవి:

దులపర బుల్లోడో హోయ్ హోయ్...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
వన్ టూ త్రీ చెప్పి.....

దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
దులపర బుల్లోడో హోయ్ హోయ్...

చరణం 1:

సిరిగల చుక్కల చీర కట్టుకొని ... జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
సిరిగల చుక్కల చీర కట్టుకొని ... జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
వరాల బొమ్మ.. ముద్దులగుమ్మ.. కాలేజీకి కదిలిందంటే
వెకిలివెకిలిగా.. వెర్రివెర్రిగా.. వెంటపడే రౌడీల పట్టుకొని...
ఊఁ పట్టుకొని .... ?
తళాంగు తథిగిణ తక తోం తోం అని
తళాంగు తథిగిణ తక తోం తోం అని

దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
దులపర బుల్లోడో హో హో హొయ్ హొయ్...

చరణం 2:

సాంప్రదాయమగు చక్కని పిల్ల ...సాయంకాలం సినిమాకొస్తే... వస్తే..
సాంప్రదాయమగు చక్కని పిల్ల ...సాయంకాలం సినిమాకొస్తే ...

ఇదే సమయమని.. ఇంతే చాలునని..
పక్క సీటులో బైఠాయించుకొని ..ఎట్టా !
చీకటి మరుగున.. చేతులు వేసే.. శిఖండిగాళ్లను ఒడిసి పట్టుకొని
చింతబరికెను చేత పట్టుకొని ... చింతబరికెను చేత పట్టుకొని

దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
దులపర బుల్లోడో హో హో హోయ్

రోడ్డు పట్టని కారులున్నవని ...మూడంతస్తుల మేడలున్నవని
రోడ్డు పట్టని కారులున్నవని ...మూడంతస్తుల మేడలున్నవని
డబ్బు చూచి ఎటువంటి ఆడది.. తప్పకుండా తమ వల్లో పడునని
ఈలలు వేసి.. సైగలు చేసే ..గోల చేయు సోగ్గాలను బట్టి
పట్టి... ?
వీపుకు బాగా సున్నం పెట్టి ...వీపుకు బాగా సున్నం పెట్టి

దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
దులపర బుల్లోడో హో హో హొయ్ హొయ్..

చరణం 3:

మాయమర్మం తెలియని చిన్నది ... మంగళగిరి తిరనాళ్లకు పోతే ..పోతే..
మాయమర్మం తెలియని చిన్నది ... మంగళగిరి తిరనాళ్లకు పోతే

జనం ఒత్తిడికి సతమతమౌతూ దిక్కుతోచక తికమక పడితే
అయ్యయ్యో !
సందు చూసుకొని.. సరసాలకు దిగు.. గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా...రమా రమణ గోవిందా.. హరి..

దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
దులపర బుల్లోడో హో హో హొయ్ హొయ్..

No comments:

Post a Comment