Monday, August 27, 2012

ఒక దీపం వెలిగింది

చిత్రం: ఏకవీర (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపథ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఒక దీపం వెలిగింది.. ఒక రూపం వెలసింది
ఒక దీపం వెలిగింది.. ఒక రూపం వెలసింది
స్నేహంలో రేకులు విరిసి ..చిరునవ్వుల వెలుగు కురిసి
స్నేహంలో రేకులు విరిసి ..చిరునవ్వుల వెలుగు కురిసి
ఒక దీపం వెలిగింది.. ఒక రూపం వెలసింది

ఒక దీపం మలిగింది.. ఒక రూపం తొలగింది
ఒక దీపం మలిగింది ..ఒక రూపం తొలగింది
వేకువ ఇక లేదని తెలిసి ..చీకటితో చేతులు కలిపి
వేకువ ఇక లేదని తెలిసి ..చీకటితో చేతులు కలిపి
ఒక దీపం మలిగింది ..ఒక రూపం తొలగింది

చరణం 1:

మంచు తెరలే కరిగిపోగా ..మనసు పొరలే విరిసిరాగా
మంచు తెరలే కరిగిపోగా ..మనసు పొరలే విరిసిరాగా
చెలిమి పిలుపే చేరుకోగ ..చెలియ వలపే నాదికాగా
అనురాగపు మాలికలల్లి.. అణువణువున మధువులు చల్లి
అనురాగపు మాలికలల్లి.. అణువణువున మధువులు చల్లి
ఒక ఉదయం పిలిచింది... ఒక హృదయం ఎగిసింది

చరణం 2:

నింగి అంచులు అందలేక.. నేలపైన నిలువరాక
నింగి అంచులు అందలేక ..నేలపైన నిలువరాక
కన్నె కలలే వెతలుకాగా ..ఉన్న రెక్కలు చితికిపోగా
కనిపించని కన్నీట తడిసి... బడబానల మెడలో ముడిచి
కనిపించని కన్నీట తడిసి... బడబానల మెడలో ముడిచి
ఒక ఉదయం ఆగింది ..ఒక హృదయం ఆరింది
ఒక ఉదయం ఆగింది.. ఒక హృదయం ఆరింది

ఒక దీపం వెలిగింది ...ఒక దీపం మలిగింది..

No comments:

Post a Comment