Friday, August 3, 2012

ఏకాంత వేళ ఈ కాంత సేవ

చిత్రం: అన్వేషణ (1985)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి :



ఏకాంత వేళ.. ఏకాంత సేవ
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా... 
మల్లెపువ్వుల్లో  తావల్లె కన్నుల్లో  ఎన్నెల్లై
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
ఏకాంత వేళా.... 

చరణం 1:


ముద్దు సాగిన.. ముచ్చట్లో
పొద్దు వాలదు.. ఇప్పట్లో
ముద్దు సాగిన.. ముచ్చట్లో
పొద్దు వాలదు.. ఇప్పట్లో
కమ్ముకున్... న ఈ కౌగిట్లో..
కాటుకంటి.. నా చెక్కిట్లో
నన్ను దాచుకో.. నా ఒంట్లో
పడకు ఎప్పుడూ.. ఏ కంట్లో
నన్ను దాచుకో.. నా ఒంట్లో
పడకు ఎప్పుడూ.. ఏ కంట్లో
ఆ చప్పట్లు...  ఈ తిప్పట్లు
నా గుప్పెట్లోనే

ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లో  తావల్లె కన్నుల్లో ఎన్నెల్లై 
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
ఏకాంత వేళా.... 

చరణం 2 :


గుబులు చూపుల.. గుప్పిట్లో
ఎవరు చూడని.. చీకట్లో
గుబులు చూపుల.. గుప్పిట్లో
ఎవరు చూడని.. చీకట్లో
చిక్కబోములే.. ఏకంట్లో
ఎదలు కలుపుకో.. సందిట్లో
దేవుడొచ్చిన.. సందట్లో
ఎదురులేదులే.. ఇప్పట్లో
దేవుడొచ్చిన.. సందట్లో
ఎదురులేదులే.. ఇప్పట్లో
ఆ.. చీక్కిట్లో
రా.. కౌగిట్లో 
మ్మ్.. నిద్దట్లో

ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏ కాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లో  తావల్లె కన్నుల్లో  ఎన్నెల్లై
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో

ఏకాంత వేళా.... 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12023

No comments:

Post a Comment