Thursday, August 16, 2012

ఏటి ఒడ్డున కూర్చుంటే

చిత్రం: ఇదా లోకం (1973) 
సంగీతం: చక్రవర్తి 
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల 


పల్లవి: 

ఏటి ఒడ్డున కూర్చుంటే...ఏరు గల గలమంటుంటే... 
ఏటి ఒడ్డున కూర్చుంటే...ఏరు గల గలమంటుంటే... 

నీటిలో మన నీడలు రెండూ...వాటేసుకుపోతూ ఉంటే 
నీటిలో మన నీడలు రెండూ...వాటేసుకుపోతూ ఉంటే... 

ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి జాణెడు దూరం.. 
ఓపలేకపోతున్నాను ఓ యమ్మా 

ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ... 
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్... 

చరణం 1: 

పిల్లగాలీ వీస్తుంటే... ఒళ్లు జల జలమంటుంటే.. 
పిల్లగాలీ వీస్తుంటే ...ఒళ్లు జల జలమంటుంటే... 
నిన్ను నీవే నీ కౌగిలిలో...నిన్ను నీవే నీ కౌగిల్లో.. 
నన్ను మరచి ...హత్తుకుంటే.... 

ఓ యమ్మ.. ఓ యమ్మాయి జాణెడు దూరం.. 
ఓపలేకపోతున్నాను ఓ యమ్మా... 
ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ... 
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్... 

చరణం 2: 

చీకటి పాకుతు వస్తుంటే.... చెరొక ఇంటికి వెళ్ళాలంటే.... 
చీకటి పాకుతు వస్తుంటే.... చెరొక ఇంటికి వెళ్ళాలంటే.... 
మళ్ళీ కలిసేదెప్పుడని నీ కళ్ళు దిగులుగ చూస్తుంటే... 
కళ్లల్లో కనిపించే దిగులే కలగా వస్తుందనుకుంటే... 

ఓ యమ్మ.. 
ఓ యమ్మ.. ఓ యమ్మాయి జాణెడు దూరం.. 
ఓపలేకపోతున్నాను... ఓ యమ్మా 

ఓ యబ్బ.. ఓ యబ్బాయి.. పిడికెడు మనసూ... 
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్... 


ఓ యమ్మ..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా 
ఓ యమ్మా..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా 
ఓ యమ్మా..ఓ యమ్మ...ఓ యబ్బా 
లాలా..ల..లా ల.ల ..లా... 
లాలా..ల..లా ...లల్ల..లా.. ..లా... 
ఊహు..ఊహు..ఊహు.. 
ఊహు..ఊహు..ఊహు...

No comments:

Post a Comment