Friday, August 3, 2012

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే

చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే 
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 

చరణం 1: 

తేనె వాగుల్లో మల్లెపూలల్లే తేలిపోదాములే 
గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే 
విసిరే కొస చూపే  ముసురైపోతుంటే 
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే 
వేడెక్కి గుండెల్లో తల దాచుకో 
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో 
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే 

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే 

తారత్తా... తరరా తరరా
తారత్తా... తరరా తరరా

చరణం 2: 

పూత పెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే 
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే 
ఒదిగే మనకేదో ఒకటై పొమ్మంటే 
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే 

కాలాలు కరిగించు కౌగిళ్ళలో 
దీపాలు వెలిగించు నీ కళ్ళతో 
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా...  నీ సొంతమేలే 


బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే 
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9320

No comments:

Post a Comment