Saturday, August 4, 2012

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది

చిత్రం: ఆడపడుచు (1967)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల


పల్లవి:

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

చరణం 1:

పెళ్ళి చూపుల్లో ఏదో వెరపు
వెళ్ళి పోయాక ఒకటే తలపు
పెళ్ళి చూపుల్లో ఏదో వెరపు
వెళ్ళి పోయాక ఒకటే తలపు

రెండు నిమిషాలలో కోటి పులకింతలై
రెండు నిమిషాలలో కోటి పులకింతలై
నిండు మదిలోన నెలకొంది తన రూపు

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

చరణం 2:

ఏల అదిరింది నా ఎడమ కన్ను
ఏల తన పేరు ఊరించె నన్ను
ఏల అదిరింది నా ఎడమ కన్ను
ఏల తన పేరు ఊరించే నన్ను

వలపు ఉయ్యాల పై పూల జంపాల పై
వలపు ఉయ్యాల పై పూల జంపాల పై
ఆశ ఆకాశ వీధుల్లో ఊగింది

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

చరణం 3:

ఇంత సంతోషమిపుడే కలిగే
ఇంక రాబోవు సుఖమెంతో కలదు
ఇంత సంతోషమిపుడే కలిగే
ఇంక రాబోవు సుఖమెంతో కలదు

పగటి కలలన్నియు పసిడి గనులైనచో
పగటి కలలన్నియు పసిడి గనులైనచో
పట్టలేదోమో నా మూగ మనసు

మది తుళ్ళి తుళ్ళి తుళ్లి ఎగిరింది
ఊహ ఉలికి ఉలికి పడుతుంది
సిగ్గు చెవిలోన గుస గుస లాడింది

1 comment: