Monday, August 27, 2012

ఒంపుల వైఖరీ

చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపథ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ 
వెల్లువ మాదిరీ ... అల్లరి ఆకలీ ... ఎందుకు పోకిరీ చాలు మరీ 
మోవినీ ... మగతావినీ ... ముడి వేయనీయవా 
కాదనీ ... అనలేననీ ... ఘడియైన ఆగవా 
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ ..హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ 

ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ 
వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో 

చరణం 1: 

"మాంగల్యం తంతునానేన... మమజీవన హేతునా 
కంఠే భద్రామి శుభకే...త్వం జీవ శరదాం  శతం 
త్వం జీవ శరదాం  శతం... త్వం జీవ శరదాం  శతం " 

కాంక్షలో కైపు నిప్పూ... ఎంతగా కాల్చినా 
దీక్షగా ఓర్చుకున్నా... మోక్షమే ఉండదా 
శ్వాసలో మోహదాహం... గ్రీష్మమై వీచగా 
వాంఛతో వేగు దేహం... మరయాగ వాటికా 

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా 
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా 
హో హో... 

ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ 
వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ... హో 

చరణం 2: 

నిష్ఠగా నిన్ను కోరీ... నీమమే దాటినా 
కష్టమే సేద తీరే... నేస్తమే నోచనా 
నిగ్రహం నీరు గారే... జ్వాలలో నింపినా 
నేర్పుగా ఈది చేరే... నిశ్చయం మెత్తనా 

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా 
మథనమే అంతమయ్యే అమృతం అందుకో 
హో హో... 

ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ 
వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11524

No comments:

Post a Comment