Friday, August 3, 2012

ఏ రాగమో ఇది ఏ తాళమో

చిత్రం :  అమర దీపం (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :



ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఆఁహాఁ.. ఊఁహూఁ.. ఆఁహాఁ.. ఉఁహూఁ


ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో


ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..



చరణం 1 :



ఎదలో మెదిలే..  సంగతులన్నీ..
పలికెను సంగీతమై.. పలికెను సంగీతమై..


కలిసిన కన్నుల.. మెరిసేకలలే..
వెలిసెను గమకములై... వెలిసెను గమకములై..


హొయలైన నడకలే లయలైనవవవి..
చతురాడు నవ్వులే గతులైనవి..
సరిసరి అనగానే..  మరిమరి కొసరాడు
మురిపాలె మన జంట స్వరమైనది..


ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో?...ఇది ఏ తాళమో?..



చరణం 2 :


విరికన్నె తనకు..  పరువమే కాదు..
పరువూ కలదన్నది... పరువు కలదన్నది..


భ్రమరము తనకు అనుభవమే కాదు..
అనుబంధమున్నది... అనుబంధమున్నది..


కోకిలమ్మ గుండెకు గొంతున్నది..
కొమ్మలో దానికి గూడున్నది..
సరిమగవానికి సగమని తలపోయు
మన జంటకే జంటసరి ఉన్నది..


ఏ రాగమో.. ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఏ రాగమో.. ఇది ఏ తాళమో..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5310

No comments:

Post a Comment