Monday, August 27, 2012

ఔనే చెలియా సరి సరి

చిత్రం: ఏకవీర (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపథ్య గానం: సుశీల

పల్లవి:

ఔనే...చెలియా...సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ..సొగసరి
ఔనే చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా... సొగసరి
ఔనే చెలియా.. సరి సరి

చరణం 1:

ఆమ్మచెల్ల తెలిసేనే ఎమ్మెలాడి వగలు
నెమ్మదిలో దాచాలని  కమ్మని కోరికలు
వాలుకన్ను రెప్పలలో వాలాడే తొందరలు
వాలుకన్ను రెప్పలలో  వాలాడే తొందరలు
దోరపెదవి అంచుల చిరునవ్వుల... దోబూచులు

ఔనే ..చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ...సొగసరి
ఔనే చెలియా... సరి సరి

చరణం 2:

పవళింపుల గదిలో... ప్రణయరాజ్యమేలాలని
పవళింపుల గదిలో... ప్రణయరాజ్యమేలాలని
నవమల్లెల పానుపుపై.. నవమదనుడు త్వరపడునే
నవమల్లెల పానుపుపై.. నవమదనుడు త్వరపడునే


చెరిపడనీవే సుంత ..ఉహు.. చీర చెరకు గుసగుసలు
ఓ ...చెరిపడనీవే సుంత.. చీర చెరకు గుసగుసలు
రవల అందె మువలూదే ..రాగరహస్యాలు

ఔనే ..చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ...సొగసరి
ఔనే చెలియా... సరి సరి

చరణం 3:

ఏ చోట దాచేవే ...ఈ వరకీ సిగ్గులు
ఈ చెక్కిటిపై పూచే...ఈ గులాబి నిగ్గులు
ఏ చోట దాచేవే ఈ వరకీ సిగ్గులు
ఈ చెక్కిటిపై పూచే...ఈ గులాబి నిగ్గులు


మాపటి బిడియాలన్ని.. రేపటికి వుండవులే..ఏ...
మాపటి బిడియాలన్ని... రేపటికి వుండవులే...
నేటి సోయగాలు ...మరునాటికి వడిలేనులే

ఔనే ..చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ...సొగసరి
ఔనే చెలియా.. సరి సరి




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=251

No comments:

Post a Comment