Friday, August 3, 2012

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

చిత్రం: అభిలాష (1983)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో...  ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో...  ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో



చరణం 1:

కొండ కోనా జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీరకట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ...  పిల్ల పాప నిదరే పోయే వేళ  
కలలో కౌగిలే కన్నులు దాటాలా 
ఎదలే పొదరిళ్ళై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది


ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో...  ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో



చరణం 2:

మల్లె జాజి మత్తుజల్లే వేళ పిల్ల గాలి జోలపాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ


కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల

పుట్టిన ఎన్నెల్లో పుట్ట కల్లు తాగాలా 
పగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలా...




సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది


మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో...  ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో



సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది






https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9319

No comments:

Post a Comment