Thursday, August 9, 2012

కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో

చిత్రం: ఆలాపన (1986)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు, జానకి



పల్లవి:





కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో

కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో

నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి

నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి



కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో.. 



చరణం 1:




పొంగిపోదా సాగరాత్మ నింగికి

చేరుకోదా చంద్ర హృదయం నీటికి

పొంగిపోదా సాగరాత్మ నింగికి

చేరుకోదా చంద్ర హృదయం నీటికి




సృష్టిలోన ఉంది ఈ బంధమే

అల్లుకుంది అంతటా అందమే

తొణికే బిడియం తొలగాలి

ఒణికే అధరం పిలవాలి

ఆ..ఆ...ఆ...

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో



చరణం 2:



మేనితోనే ఆగుతాయి ముద్రలు

గుండె దాకా సాగుతాయి ముద్దులు

మేనితోనే ఆగుతాయి ముద్రలు

గుండె దాకా సాగుతాయి ముద్దులు





ఇంత తీపి కొంతగా పంచుకో

వెన్నెలంత కళ్ళలో నింపుకో

బ్రతుకే జతగా పారాలి... పరువం తీరం చేరాలి

ఆ...ఆ...ఆ...ఆ


కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో



నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి

నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12442

No comments:

Post a Comment