Monday, August 27, 2012

తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము

చిత్రం: అంతస్తులు (1965) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 

తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము 
మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము 

తెల్లచీర కట్టుకున్నదెవరికోసము 
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము 
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము 
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము... 

తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా 
కల్లకపటమెరుగని మనసు కోసము 
తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా 
కల్లకపటమెరుగని మనసు కోసము 
మనసులోని చల్లని మమత కోసము 

చరణం 1: 

దాచుకున్న మమతలన్ని ఎవరికోసము 
దాపరిక౦ ఎరుగని మనిషి కోసము 
దాచుకున్న మమతలన్ని ఎవరికోసము 
దాపరిక౦ ఎరుగని మనిషి కోసము 
దాగని యవ్వన౦ ఎవరి కోసము 
దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము 

తెల్లచీర కట్టుకున్నదెవరికోసము 
కల్లకపటమెరుగని మనసు కోసము 
మనసులోని చల్లని మమత కోసము 

చరణం 2: 

పొద్ద౦తా కలవరి౦త ఎవరికోసము 
నిద్దురైన రానీని నీ కోసము 
ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ 
నీవు నన్ను చేరదీసిన౦దుకోసము 
ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ 
నీవు నన్ను చేరదీసిన౦దుకోసము 
నేల మీద ఒక్కరై సాగిపోదము 
ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ.. 

తెల్లచీర కట్టుకున్నదెవరికోసము 
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము 
తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా 
కల్లకపటమెరుగని మనసు కోసము 
మనసులోని చల్లని మమత కోసము

No comments:

Post a Comment