Monday, August 27, 2012

ఏ పారిజాతమ్ములీయగలనో

చిత్రం: ఏకవీర (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సినారె 

నేపథ్య గానం: బాలు 


పల్లవి: 


ఏ పారిజాతమ్ములీయగలనో…  సఖీ 

గిరి మల్లికలు తప్ప…  గరికపూవులు తప్ప 

ఏ కానుకలను అందించగలనో…  చెలీ 

గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప 


జగతిపై నడయాడు చంచలా వల్లికా 

తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా... 

శరదిందు చంద్రికా... 



చరణం 1: 


నీవు లేని తొలి రాతిరి... నిట్టూర్పుల పెను చీకటి 

నీవు లేని విరి పానుపు... నిప్పులు చెరిగే కుంపటి 


విరులెందుకు... సిరులెందుకు 

మనసు లేక  మరులెందుకు 

తలపెందుకు... తనువెందుకు 

నీవు లేక నేనెందుకు 

నీవు లేక నేనెందుకు


No comments:

Post a Comment