Monday, August 6, 2012

నాలుగు కళ్ళు రెండైనాయి

చిత్రం: ఆత్మబలం (1964) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను 

చరణం 1: 

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి 
కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి 
రెండూ లేక పండురేకులై ఎందుకు నాకీ కనుదోయి 
ఇంకెందుకు నాకీ కనుదోయి 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను 

చరణం 2: 

కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని 
కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని 
నిలువుగ నన్ను దోచుకుంటివి నిరుపేదగ నే 
నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను

No comments:

Post a Comment