Monday, August 27, 2012

ప్రతి రాత్రి వసంత రాత్రి

చిత్రం: ఏకవీర (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: దేవులపల్లి
నేపథ్య గానం: ఘంటసాల, బాలు

పల్లవి :

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతినిమిషం పాట లాగ సాగాలీ
ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాట లాగ సాగాలీ
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

చరణం 1:

నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
లోలోన మల్లెపొదలా పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లెపొదలా పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతినిమిషం మధుమాసం కావాలీ
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలీ
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

చరణం 2:

ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక
ఒరిగింది చంద్రవంకా వయ్యారి తారవంక
విరజాజి తీగసుంత జరిగింది మావిచెంత
విరజాజి తీగసుంత జరిగింది మావిచెంత
నను జూచీ నిను జూచీ వనమంతా వలచిందీ
నను జూచీ ప్రియా ప్రియా వనమంతా వలచిందీ
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=172

No comments:

Post a Comment