Thursday, August 2, 2012

పాడనా తెనుగు పాట

చిత్రం: అమెరికా అమ్మాయి (1976) 
సంగీతం: జి.కె. వెంకటేశ్ 
గీతరచయిత: దేవులపల్లి 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

పాడనా తెనుగు పాట... 
పాడనా తెనుగు పాట... 
పరవశనై..నే పరవశనై మీ ఎదుట మీ పాట 

చరణం 1: 

కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో... 
కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో... 
మావులు పూవులు మోపులపైన మసలేగాలుల గుసగుసలో 
మంచి ముత్యాల పేట.. మధురామృతాల తేట.. ఒకపాట 

చరణం 2: 

త్యాగయ.. క్షేత్రయ.. రామదాసులు... 
త్యాగయ.. క్షేత్రయ.. రామదాసులు.. తనివితీర వినిపించినది 
నాడునాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది 
చక్కెర మాటల మూట.. చిక్కని తేనెల ఊట.. ఒక పాట 

చరణం 3: 

ఒళ్ళంత ఒయ్యారి కోక.. కళ్ళకు కాటుక రేఖ 
ఒళ్ళంత ఒయ్యారి కోక.. కళ్ళకు కాటుక రేఖ 
మెళ్ళో తాళి, కాళ్ళకు పారాణి.. మెరిసే కుంకుమ బొట్టు 
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లనా నడయాడే 
తెలుగు తల్లి పెట్టని కోట.. తెలుగు నాట ప్రతిచోట.. ఒక పాట

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4706

No comments:

Post a Comment