Saturday, August 4, 2012

వలపులు విరిసిన పూవ్వులె

చిత్రం: ఆత్మగౌరవం (1966) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత: శ్రీశ్రీ 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే.. 
మనసులు కలిపిన చూపులె పులకించి పాడెలే.. 

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే... 

చరణం 1: 

బరువు కనుల నను చూడకు... మరులు కొలిపి మది రేపకు 
బరువు కనుల నను చూడకు.. మరులు కొలిపి మది రేపకు 

చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు 

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే... 

చరణం 2: 

ఉరిమిన జడిసే నెచ్చెలి... అడుగక ఇచ్చెను కౌగిలి... 
ఉరిమిన జడిసే నెచ్చెలి... అడుగక ఇచ్చెను కౌగిలి.. 

నీ హృదయములో వొదిగినచో బెదురింక యేమ్మునది.. 

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే... 

చరణం 3: 

తొలకరి చినుకుల చిటపటలు... చలి చలి గాలుల గుస గుసలు 
తొలకరి చినుకుల చిటపటలు... చలి చలి గాలుల గుస గుసలు 

పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే...ఓ..ఓ.. 
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే.. 
మనసులు కలిపిన చూపులె పులకించి పాడెలే.. 

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే

No comments:

Post a Comment