Sunday, August 26, 2012

చాలులే నిదరపో

చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా (1968) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: దేవులపల్లి 
నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 

చాలులే నిదరపో... జాబిలి కూనా 
ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా 
ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా 
చాలులే నిదరపో జాబిలి కూనా... 
ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా 
ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా 
తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా 
తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా 

చరణం 1: 

అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా 
ఓసి... వేలెడేసి లేవు బోసి నవ్వులదానా 
అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా 
ఓసి... వేలెడేసి లేవు బోసి నవ్వులదానా 

మూసే నీ కనుల.. ఎటుల పూసేనే నిదర... 
అదర... జాబిలి కూనా... 
ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా 
ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా 
తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా 
తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా 

చరణం 2: 

అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే 
కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ 
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే 
కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ 

ఔరా కోరికలు.. కలలు... తీరా నిజమైతే.. 
ఐతే... జాబిలి కూనా... 
ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా 
ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా 
తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా 
తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా 
ఉహ్మ్... ఉహ్మ్... ఉహ్మ్... ఉహ్మ్...

No comments:

Post a Comment