Friday, August 3, 2012

ఈ వీణ పైన పలికిన రాగం

చిత్రం: అభిమానవంతులు (1973) 

సంగీతం: కోదండపాణి 

గీతరచయిత: సినారె 

నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం 

మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం 

మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం 

ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం 

చరణం 1: 

కలిమిలోన మిడిసిపడనిది...  లేమిలోన కలత పడనిది 

కలిమిలోన మిడిసిపడనిది...  లేమిలోన కలత పడనిది 

ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 

ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 

వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ.. 

ఈ వీణ పైన పలికిన రాగం...  నాలోన విరిసిన అనురాగం 

చరణం 2: 

కనిపించే ఆతని చిరు నవ్వులోనా...  కవితలకందని మధురభావన.. ఆ.. 

కనిపించే ఆతని చిరు నవ్వులోనా...  కవితలకందని మధురభావన 

ఆ భావనయే ఆరాధనగా...  

ఆ భావనయే ఆరాధనగా...  అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ 

ఈ వీణ పైన పలికిన రాగం...  నాలోన విరిసిన అనురాగం

మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం 

ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4005

No comments:

Post a Comment