Monday, August 27, 2012

ఏడంతస్తుల మేడ ఇది

చిత్రం: ఏడంతస్తుల మేడ (1980) 
సంగీతం: చక్రవర్తి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 

ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది 
ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది 
ఏమీ లేక ఉన్నదొక్కటే... 
నాకు మీరు.. మీకు నేను 
నాకు మీరు.. మీకు నేనూ.... 

చరణం 1: 

పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే 
కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే 
పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే 
కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే 

చాప కన్న చదరే మేలని.. చతికిలపడి అతుకుతు ఉంటే 
ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే.. 
ఏయ్ నిదరనే నిదరపొమ్మంటుంటే ఏ ఏ ఏ... 
వెన్నెల మల్లెల మంచమిది.. ఎన్నో జన్మల లంచమిది 
మూడు పొద్దులు ముద్దు ముచ్చటే.. 
నాకు మీరు .. మీకు నేను 
నాకు మీరు మీకు నేనూ..... 

ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది 

చరణం 2: 

పాయసాన గరిటై తిరిగే... పాడు బతుకులెందుకు మనకు 
పాలలోన నీరై కరిగే.. బంధమొకటి చాలును కడకు 
పాయసాన గరిటై తిరిగే... పాడు బతుకులెందుకు మనకు
పాలలోన నీరై కరిగే... బంధమొకటి చాలును కడకు 

చావు కన్నా బ్రతుకే మేలని.. తెలిసి కలిసి మసులుతు ఉంటే 
ప్రేమకన్న పెన్నిధి లేదని తెలుసుకో.. 
ఏయ్ తెలుసుకో మనసు నీదంటుంటే ఏ ఏ ఏ... 

ఎండ వానల ఇల్లు ఇది..ఎండని పూపొదరిల్లు ఇది 
రేయి పగలు ఆలు మగలే... 
నాకు మీరు.. మీకు నేను 
నాకు మీరు మీకు నేనూ... 

ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది 
ఏమీ లేక ఉన్నదొక్కటే... 
నాకు మీరు.. మీకు నేను 
నాకు మీరు.. మీకు నేనూ....

2 comments:

  1. దయచేసి సరిచూడగలరు.

    చరణం 2:

    పాయసాన గరిటై తిరిగే..పాడు బతుకులెందుకు మనకు

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ మహేష్ గారు!!

      Delete