Wednesday, December 5, 2012

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, జానకి



పల్లవి:



అతడు : కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా

ఆమె : చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. నా ముద్దు పుచ్చుకోవా

అతడు : లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఆమె : ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా

అతడు : కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా

ఆమె: చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. నా ముద్దు పుచ్చుకోవా



చరణం 1:

అతడు : కొండ కోనల్లో చాటుగా.. ఎత్తు పల్లాలు తెలిసేలే

ఆమె : కంటి కోణాలు సూటిగా.. కొంటె బాణాలు విసిరేలే

అతడు : సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ

ఆమె : చూపుకే సుళ్ళు తిరిగె నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ

అతడు : కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో

ఆమె : పడేశాక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో

అతడు : సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే

ఆమె :  తణక్కు దిన.. 

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. నా ముద్దు పుచ్చుకోవా..



అతడు : కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా



చరణం 2:

ఆమె : మెత్తగా తాకు చూపుకే.. మేలుకున్నాయి సొగసులే

అతడు : కోత్తగా తాకు గాయమే.. హాయి అన్నాయి వయసులే

ఆమె : కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా

అతడు : కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా

ఆమె: భరోసాల వీరా రారా... భరిస్తాను నీ సత్తా

అతడు : శ్రుతేమించు శృంగారంలో... రతే నీకు మేనత్తా



ఆమె : ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు... హద్దులే లేవులే...



అతడు : తణక్కు దిన

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా



ఆమె : చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. నా ముద్దు పుచ్చుకోవా

అతడు : లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఆమె : ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా

అతడు: కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా

ఆమె : ఏయ్.. చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా

నా ముద్దు పుచ్చుకోవా.. ఆ.. ఆ.. ఆ.. 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9441

No comments:

Post a Comment