Wednesday, December 5, 2012

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

చిత్రం: కొండవీటి సింహం (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిలా... బ్రతుకే హాయిగా
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిలా... బ్రతుకే హాయిగా

చరణం 1:

ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం...
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం...
సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం
ప్రేమే పెన్నిధిగా .. దైవం సన్నిధిగా
ప్రేమే పెన్నిధిగా .. దైవం సన్నిధిగా
సమశృతిలో జత కలిసి
ప్రియలయలో అదమరచి .. అనురాగాలు పలికించువేళా...

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగా

చరణం 2:

అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు...
తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు
ఒకటే ఊపిరిగా.. కలలే చూపులుగా
ఒకటే ఊపిరిగా .. కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
మమతలనే మధువొలికే .. శుభయోగాలు తిలకించువేళా..

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగా

No comments:

Post a Comment