Monday, December 17, 2012

ఎవరీ చక్కనివాడు

చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: మైలవరపు గోపి 

నేపథ్య గానం: బాలు, సుశీల 



పల్లవి : 


ఓ.. హొ.. ఓఓఓ.. హొ.. ఓఓ.. హొ.. హా 


ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. 

ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ 


ఆఆ.. ఆ..ఆ

 

ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. 

ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ 



చరణం 1 : 


కదలిక వుంది.. మబ్బులో కదలిక వుంది.. 

నీటికీ వేగం వుంది.. గాలికీ చలనం వుంది.. 

వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుంది


కదలిక వుంది మబ్బులో కదలిక వుంది 

నీటికీ వేగం వుంది గాలికీ చలనం వుంది 

వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుంది


వయసొచ్చింది.. దానితో వలపొచ్చింది.. హా.. ఆ.. ఆ.. 

వయసొచ్చింది.. దానితో వలపొచ్చింది 

అందుకే చిన్నది తొందర పడుతోంది.. అందుకే చిన్నది తొందర పడుతోంది



ఆఆ..ఆఆ.. అ 

ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. 

ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ 



చరణం 2 : 



కన్నేసింది.. కళ్ళతో కట్టేసింది.. 

చూపుతో చంపేస్తుంది.. నవ్వుతో బ్రతికిస్తుంది 

అమ్మమ్మో.. కుర్రది చాలా టక్కరిది 


కన్నేసింది కళ్ళతో కట్టేసింది 

చూపుతో చంపేస్తుందీ నవ్వుతో బ్రతికిస్తుంది 

అమ్మమ్మో..కుర్రది చాలా టక్కరిది


వీడితో ఔననిపించి.. కొంగుముడి వెయ్యకపోతే 

వీడితో ఔననిపించి.. కొంగుముడి వెయ్యకపోతే 

ఎందుకీ ఆడజన్మ వోయమ్మా.. ఎందుకీ ఆడజన్మ వోయమ్మా.. ఆఆ..ఆఆ.. ఆఆ 



ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. 

ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ




No comments:

Post a Comment