Saturday, December 15, 2012

వస్తావు కలలోకీ

చిత్రం: గోపాలరావు గారి అమ్మాయి (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: జి. ఆనంద్, సుశీల

పల్లవి:

వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ
వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ


వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ
వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ
నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ

చరణం 1:

పెదవి పైన పెదవి గుబులు పడుచుదనమే తీయటి దిగులు
కుర్రవాడికి తీరదు మోజు చిన్నదానికి బిడియం పోదు

చూపు చూపు కలిసిన చాలు.. కొంగు కొంగు కలిపిన మేలు
నన్ను దరి చేరనీ.. ముద్దు వాటారని
ముద్దు నెరవేరనీ.. ముందు జతకూడనీ

వస్తావు కలలోకీ రానంటాను కౌగిలికీ
నే కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ

చరణం 2:

చిన్నదాన్ని నిన్నటి వరకు కన్నెనైనది ఎవ్వరి కొరకు
నాకు తెలుసు నాకోసమని నీకే తెలియదు ఇది విరహమని

నేనూ నువ్వు మనమైపొయే వేళా.. ఇంకా ఇంకా ఇంతటి దూరం ఏలా
వలచి వలపించనా.. కరిగి కరిగించనా
నవ్వి నవ్వించనా.. గెలిచి గెలిపించనా

వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ
నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ

వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ

No comments:

Post a Comment