Tuesday, December 4, 2012

ఒక్క క్షణం

చిత్రం: కలిసిన మనసులు (1968)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఒక్క క్షణం ఒక్క క్షణం
నన్ను పలకరించకు నా వైపిటు చూడకు
ఒక్క క్షణం ఒక్క క్షణం

నిన్ను తలచుకోనీ నా కన్ను మూసుకోనీ
మోయలేని ఈ హాయిని మోయనీ
ఒక్క క్షణం ఒక్క క్షణం


ఒక్క క్షణం ఒక్క క్షణం
ఆ రెప్పలు వాల్చకూ
అటు ఇటు కదలకు
ఒక్క క్షణం ఒక్క క్షణం

చరణం 1:

ఆ కన్నులలో ఊహల అర్ధమేదొ అడగనీ
ఆ కొలనులలో నీడలా అదే పనిగ చూడనీయ్

మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం

చరణం 2:

ఆకులతో గాలి ఊసులాడకూడదు
ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు
ఆకులతో గాలి ఊసులాడకూడదు
ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు

మేను మేను తాకగా.. మౌనముగా గువ్వలవలే
కొమ్మ పైని మాటాడక కునుకు జంట పువ్వుల వలే

మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం

చరణం 3:

మోము పైన ముంగురులు ముసరవచ్చునా
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా
మోము పైన ముంగురులు ముసరవచ్చునా
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా

వాగులాగా ఈ సమయం సాగిపోవుననే భయం
నాలో నిండిన నీవే నాకు చాలు నేటికి

మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం ఒక్క క్షణం

ఒక్క క్షణం ఆ.. ఆ
ఒక్క క్షణం..ఆ..ఆ
ఒక్క క్షణం ఆ.. ఆ

No comments:

Post a Comment