Monday, December 17, 2012

సదాశివా సన్యాసి

చిత్రం: ఖలేజా (2011)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
నేపధ్య గానం: కారుణ్య, రమేష్
 

పల్లవి

ఓం నమో శివ రుద్రాయ..
ఓం నమో శితి కంఠాయ...
ఓం నమో హర నాగాభరణాయా.. 
ప్రణవాయఢమ ఢమ ఢమరుక నాదానందాయ.. 
ఓం నమో నిఠలాక్ష్యాయ..
ఓం నమో భస్మాంగాయ..
ఓం నమో హిమశైలావరణాయ.. ప్రమధాయ 
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ...

పల్లవి
సదాశివా సన్యాసి.. తాపసి కైలాసవాసి.. 
నీ పాదముద్రలు మోసి.. పొంగి పోయినాదె పల్లె కాశి.. 
ఏయ్ సూపుల సుక్కాని దారిగా.. సుక్కల తివాసీ మీదిగా
సూడ సక్కని సామి దిగినాడురా.. ఏసైరా ఊరు వాడా దండోరా.. 

 రంగుల హంగుల పొడ లేదురా.. ఈడు జంగమ శంకర శివుడేనురా.. 
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా.. నీ తాపం.. శాపం తీర్చేవాడేరా
పైపైకలా.. బైరాగిలా... ఉంటాదిరా  లీల

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ.. 
ఏయ్.. నీలోనె కొలువున్నోడు.. నిన్ను దాటి పోనే పోడు
om namashiva jai jai jai 

om namashiva jai jai jai 
om namashiva go to the trance and say jay jay 
sing along sing shiv shambo all the way 
om nama shiva jai jai jai heal the world is all we pray 
save our lives and take our pain away jai jai 
sing along sing shiv shambo all the way 

చరణం 1: 

సదాశివా సన్యాసి.. తాపసి కైలాసవాసి.. 
నీ పాదముద్రలు మోసి.. పొంగి పోయినాదె పల్లె కాశి.. 
ఏయ్..ఎక్కడ వీడుంటే నిండుగా.. అక్కడ నేలంతా పండగ.. 
సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా.. అడుగేశాడంటా కాచే దొరలాగా

మంచునుమంటను ఒక్క తీరుగా.. లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా.. 
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా.. మనకండ దండ వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంట!! 

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ.. 
ఏయ్.. నీలోనె కొలువున్నోడు.. నిన్ను దాటి పోనే పోడు
om namashiva jai jai jai 

om namashiva jai jai jai 
om namashiva move to the trance and say 
jai jai jai 
sing along sing shiv shambo all the way 
Om namah Shiva jai jai jai 
heal the world is all we pray 
save our lives and take our pain away 
jai jai jai 
sing along sing shiv shambo all the way

No comments:

Post a Comment