Tuesday, December 4, 2012

నవరాగానికీ నడకలు వచ్చెనూ

చిత్రం: కళ్యాణి (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

నవరాగానికీ నడకలు వచ్చెనూ
మధుమాసానికీ మాటలు వచ్చెనూ
నడకలు కలిపీ... నడవాలీ
మాటలూ కలిపీ... మసలాలీ

నవరాగానికీ నడకలు వచ్చెనూ
మధుమాసానికీ మాటలు వచ్చెనూ

చరణం 1:

సరసాల ఆటలో... సరాగాల తోటలో
ఆ...ఆ...ఆ...ఆ...
సరసాల పాటలో... సరాగాల తోటలో
అనురాగానికీ అంటులు కట్టాలీ
అనురాగానికీ అంటులు కట్టాలీ

మొలకెత్తిన ఆశకూ... చిగురించిన ఊసుకూ
ఆ...ఆ...ఆ...ఆ...
మొలకెత్తిన ఆశకూ... చిగురించిన ఊసుకూ
తొలకరి నాటులు... నాటాలీ
తొలకరి నాటులు... నాటాలీ

నవరాగానికీ నడకలు... వచ్చెనూ
మధుమాసానికీ మాటలు... వచ్చెనూ

చరణం 2:

కులుకులకు కుదురులు కట్టీ
పరువాలకు పందిరి వేయాలీ
పున్నమి నాటికి పువ్వులు పూయించాలీ
ఆ...ఆ...ఆ...ఆ...
కులుకులకు కుదురులు కట్టీ
పరువాలకు పందిరి వేయాలీ
పున్నమి నాటికి పువ్వులు పూయించాలీ
పువ్వులు పూయించాలీ

పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
ఆ...ఆ...ఆ...ఆ...
పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
అర్పణ చేయాలీ


నవరాగానికీ నడకలు... వచ్చెనూ
మధుమాసానికీ మాటలు... వచ్చెనూ
నడకలు కలిపీ నడవాలీ
మాటలూ కలిపీ మసలాలీ
నవరాగానికీ నడకలు... వచ్చెనూ
మధుమాసానికీ మాటలు... వచ్చెనూ

No comments:

Post a Comment