Thursday, December 6, 2012

నిద్దురపోరా సామీ

చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970)
సంగీతం: టి.వి. రాజు
నేపధ్య గానం: జానకి, 
బాలు 

పల్లవి:

నిద్దురపోరా సామీ..
అహా.. నిద్దురపోరా సామీ.. నా ముద్దూ మురిపాల సామీ..
చలి రాతిరి తీరేదాకా.. తెల తెలవారే దాకా
నిద్దురపోరా సామీ... ఈ...

చరణం 1:

మాయదారి మల్లెమొగ్గలు మత్తు జల్లుతాయేమో..
జిత్తుమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమో...
మాయదారి మల్లెమొగ్గలు మత్తు జల్లుతాయేమో..
జిత్తుమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమో...

హోయ్.. సొందురూనీ చూపు తగిలి కందిపోతావేమో...
హోయ్.. సందురూనీ చూపు తగిలి కందిపోతావేమో...
ఈ చిన్నదాని చెంగు మాటున మోము దాచి.. ఆదమరచి..

నిద్దురపోరా సామీ.. నా ముద్దూ మురిపాల సామీ..
చలిరాతిరి తీరేదాకా.. తెల తెలవారే దాకా
నిద్దురపోరా సామీ... ఈ...

చరణం 2:

గుండె నిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే...
కన్నెసిగ్గులే మల్లెమొగ్గలై కన్నుగీటి కవ్విస్తుంటే...
గుండె నిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే...
కన్నెసిగ్గులే మల్లెమొగ్గలై కన్నుగీటి కవ్విస్తుంటే...

పండువెన్నెల పాలనురుగుల పానుపేసి పిలుస్తుంటే
పడుచుదనమే పిల్లగాలికి పడగెత్తి ఆడుతుంటే...
నిద్దరపోనా పిల్లా... ఆ
నిద్దరపోనా పిల్లా... నా ముద్దూ మురిపాల పిల్లా
చలిరాతిరి తీరేదాకా.. తెల తెలవారే దాకా
నిద్దరపోనా పిల్లా... హోయ్
నిద్దరపోనా పిల్లా...

No comments:

Post a Comment