Tuesday, December 4, 2012

ప్రియ ప్రియతమా రాగాలు

చిత్రం: కిల్లర్ (1993)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: మనో, చిత్ర

పల్లవి:

ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు..
ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు.
నీ లయ పంచుకుంటుంటే... నా శృతి మించి పోతుంటే నాలో.. రేగే

ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు...
ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు...

చరణం 1:

జగాలు లేని సీమలో.. యుగాలు దాటే ప్రేమలు..
పెదాలు మూగ పాటలో... పదాలు పడే ఆశలు
యెవరులేని మనసులో.. ఎదురు రావే నా చెలి..
అడుగు జారే వయసులో... అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం.. కుహు నినాదం నీలో.. నాలో పలికే...

ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు..
నీ లయ పంచుకుంటుంటే... నా శృతి మించి పోతుంటే నాలో.. రేగే...
ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు...

చరణం 2:

శరత్తులోనా వెన్నెల.. తలెత్తుకుంది కన్నుల..
షికారు చేసే కోకిల... పుకారు వేసే కాకిల
ఎవరు ఎంత వగచిన... చిగురువేసే కోరిక
నింగి తానే విడిచిన... ఇలకు రాదు తారక
మదే ప్రపంచం.. విధే విలాసం.. నిన్ను.. నన్ను.. కలిపే..

ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు..
ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు..
నీ లయ పంచుకుంటుంటే... నా శృతి మించి పోతుంటే నాలో.. రేగే...
ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు...
ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు..

No comments:

Post a Comment