చిత్రం: కల్పన (1977) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: సుశీల, జి.ఆనంద్ పల్లవి: దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా.. సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. ముందుకు రావే ముద్దుల గుమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మా... ముందుకు రావే ముద్దుల గుమ్మ...ముద్దులగుమ్మా దిక్కులు చూడకు రామయ్య చరణం 1: ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ... ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ... కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో..రామయ్యా.. పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు. పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు. ఆ వెన్నెలలో... నీ కన్నులలో... ఆ వెన్నెలలో..నీ కన్నులలో.. సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. సీతమ్మా..సీతమ్మా దిక్కులు చూడకు రామయ్య చరణం 2: కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో.. కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో.. కలలిక మాని కలయికలో..నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు.. వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు.. ఆ వెల్లువలో... నా పల్లవిలో.. ఆ వెల్లువలో.. నా పల్లవిలో.. రాగమే పలికించు.. అనురాగమై పులకించు..రాగమే పలికించు.. అనురాగమై పులకించు..సీతమ్మా..సీతమ్మా.. దిక్కులు చూడకు రామయ్య | |
Tuesday, December 4, 2012
దిక్కులు చూడకు రామయ్యా
Labels:
కల్పన (1977),
చక్రవర్తి,
జి.ఆనంద్,
వేటూరి,
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment