Sunday, December 9, 2012

ఆమని పాడవే హాయిగా


చిత్రం: గీతాంజలి (1989)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు


పల్లవి:


ఆమని పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళ

రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో

మంచు తాకి కోయిల మౌనమైన వేళల...


ఆమని పాడవే హాయిగా.. 

ఆమని పాడవే హాయిగా.. 



చరణం 1:


వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా

మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా

పదాల నా యెద స్వరాల సంపద

తరాల నా కథ క్షణాలదే కదా.... గతించి పోవు గాధ నేనని.... 




ఆమని పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళ

 రాలేటి పూలా రాగాలతో....




చరణం 2:


శుకాలతో పికాలతో.. ధ్వనించినా మధూదయం

దివి భువి కలా నిజం.. సృశించిన మహోదయం

మరో ప్రపంచమే మరింత చేరువై..

నివాళి కోరినా ఉగాది వేళలో...  గతించి పోని గాధ నేనని...




ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ 

రాలేటి పూలా రాగాలతో.. పూసేటి పూలా గంధాలతో....



మంచు తాకి కోయిల మౌనమైన వేళల...

ఆమని పాడవే హాయిగా.. 


ఆమని పాడవే హాయిగా..



No comments:

Post a Comment