Tuesday, December 4, 2012

ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ

చిత్రం: కుమారరాజా (1978) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: వేటూరి 
నేపథ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ.... 
తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు 

ఆగాలి ఆగాలి అమ్మాయీ గారూ.... 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు 

ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు ఆగదింక ఈ గాలి ఈ జోరు 

చరణం 1: 

మాఘమాసం దాకా ఆగలేనూ 
తాళికట్టే దాక తాళలేను ..ఆహా 
మాఘమాసం దాకా ఆగలేనూ 
తాళికట్టే దాక తాళలేను 

మొహమాట పడకు.. నా మోహం పెంచకు 
మొహమాట పడకు.. నా మోహం పెంచకు 
ఈ మోహం ఈ దాహం మోయలేను 
కలలేకంటూ నిదుర కాయలేను 

ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ 
తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు 

చరణం 2: 

కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు 
ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు 
కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు 
ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు 

కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు 
ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు 
కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు 
ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు 

మంచు కరిగి పోతోంది ఎండ వేడికి 
మనసు రగిలిపోతోంది కొండ గాలికి 


ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు 

చరణం 3: 

మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ 
చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు 
ఆ ఆ ... 
మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ 
చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు 
ఆ చూపు చూడకు నా తాపం పెంచకు 
ఆ చూపు చూడకు నా తాపం పెంచకు 
ఆ తీపి ఈ తాపం ఓపలేనూ.. ఎదుటే ఉన్న తెరలు తీయలేను 


ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ లలల లలల లలల 
తగ్గాలి కాబోయే శ్రీవారు తమరింక కాలేదు మా వారు 

ఆగాలి ఆగాలి అమ్మాయిగారూ లలల లలల లలల 
తగ్గాలి కాబోయె శ్రీమతి గారు అహా ఆగదింక ఈ గాలి ఈ జోరు

No comments:

Post a Comment