Tuesday, December 4, 2012

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో

చిత్రం: కురుక్షేత్రం (1977) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల 

పల్లవి: 

సంధ్యకెంజాయలో...ఓ.. 
సరసాల సరసి దరినీ... 
కలిసినవి ఇరుకన్నులు... 
మెరసినవి...పలు వన్నెలు...ఆ..ఆ..ఆ.ఆ...ఆ... 

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 
హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 
ప్రణయాల విరిజల్లు కురిపించెనేమో 
మురిపించెనేమో...మైమరపించెనేమో... 
హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 

చరణం 1: 

విరియని విరజాజులు... నా వలపులా లేతలపులు... 
విరియని విరజాజులు... నా వలపులా లేతలపులు... 
పెదవుల దరహాసము...నే దాచితీ నీ కోసము... 
నీ కథలు విన్నాను చిననాటి నుంచి... 
నే కలలు కన్నాను అనురాగమెంచి.... 

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 
ప్రణయాల విరిజల్లు కురిపించెనేమో 
మురిపించెనేమో...మైమరపించెనేమో... 

చరణం 2: 

నునుసిగ్గు చెలరేగి..పులకింతలాయే... 
తొలిప్రేమ మురిపాల చిగురింతలాయే.... 

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి.. 
ప్రణయాల విరిజల్లు కురిపించెనోయి.. 
మురిపించెనోయి...మైమరపించెనోయి... 
హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి..

No comments:

Post a Comment