Sunday, December 9, 2012

ఓం నమః

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, జానకి

పల్లవి:

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో..

చరణం 1:

రేగిన కోరికలతో గాలులు వీచగా..
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా..
కాలము లేనిదై గగనము అందగా..
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం...

చరణం 2:

ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగా మారనా..
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా..
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమొందిన ప్రేమ జంటకి...

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో..

No comments:

Post a Comment