Tuesday, December 4, 2012

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్యను నేను

చిత్రం: కళ్యాణి (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

లలిత కళారాధనలో.. వెలిగే చిరు దివ్యను నేను..ఊ..ఊ
లలిత కళారాధనలో.. వెలిగే చిరు దివ్యను నేను..ఊ..ఊ..ఊఊ
మధురభారతి పద సన్నిధిలో..ఓ..ఓ..మధురభారతి పద సన్నిధిలో
ఒదిగే తొలిపువ్వును నేను ఊ..ఊ..ఒదిగే తొలిపువ్వును..ఊ..నేను
లలిత కళారాధనలో.. వెలిగే చిరు దివ్యను నేను..ఊ..ఊ

చరణం 1:

ఏ..ఫలమాశించి.. మత్తకోకిలా..ఆ
ఎలుగెత్తి పాడునూ..ఊ..ఊ..ఊ
ఏ..ఫలమాశించి.. మత్తకోకిలా..ఆ
ఎలుగెత్తి పాడునూ..ఊ..ఊ..ఊ

ఏ వెల ఆశించి పూచే పువ్వూ.. తావిని విరజిమ్మునూ..ఊ..ఊ..ఊ

అవధిలేని ప్రతి అనుభూతికి..ఈ..ఈ..అవధిలేని ప్రతి అనుభూతికి
ఆత్మానంధమే..ఏ..ఏ..పరమార్థం

లలిత కళారాధనలో.. వెలిగే చిరు దివ్యను నేను..ఊ..ఊ

చరణం 2:

ఏ సిరి కోరి పోతన్నా..ఆ..భాగవత సుధలు చిలికించెనూ..ఊ..ఊ..ఊ

ఏ..నిధి కోరి త్యాగయ్యా..రాగజల నిధులు పొంగించెనూ..ఊ..ఊ..ఊ

రమణీయ కళా..ఆ..విష్కృతికి..ఈ..ఈ
రమణీయ కళా..ఆ..విష్కృతికి..ఈ..ఈ
రసా..ఆ..నందమే పరమార్థం.

లలిత కళారాధనలో.. వెలిగే చిరు దివ్యను నేను..ఊ..ఊ..ఊఊ
మధురభారతి పదసన్నిధిలో..ఓ..ఓ..మధురభారతి పదసన్నిధిలో

1 comment: