Saturday, December 15, 2012

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి

చిత్రం: గోరింటాకు (1979) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: శ్రీశ్రీ 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి 
ఎన్నో వరాల మాలలు గుచ్చి 
నా మెడ నిండా వేశావు 
నన్నో మనిషిని చేశావు 
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి 

తీరాలంటే దారులు లేవా 
కడలి కూడా తీరం లేదా 
అడిగినవన్నీ ఇవ్వాలీ 
అడిగినప్పుడే ఇవ్వాలీ 
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి 

చరణం 1: 

అడిగినప్పుడే వరమిస్తారు.. ఆకాశంలో దేవతలు 
అడగముందే అన్నీ ఇచ్చే.. నిన్నే పేరున పిలవాలీ 
నిన్నే తీరున.. కొలవాలీ 

అసలు పేరుతో నను పిలవద్దు 
అసలు కన్నా వడ్డీ ముద్దు 
ముద్దు ముద్దుగా ముచ్చట తీర 
పిలవాలీ.. నను కొలవాలీ 

అలాగ తీరాలీ.. నా ఋణమలాగ తీరాలీ 

చరణం 2: 

కన్నులకెన్నడూ కనగరానిది 
కానుకగా నేనడిగేదీ 

అరుదైనది నీవడిగేది 
అది నిరుపేదకెలా దొరికేది 
ఈ నిరుపేదకెలా దొరికేది 

నీలో ఉన్నది.. నీకే తెలియదు 
నీ మనసే నే కోరుకున్నది 

అది నీకెపుడో ఇచ్చేశానే 
నీ మదిలో అది చేరుకున్నదీ 

ఇంకేం?... 
ఇలాగ తీరిందీ.. మన ఋణమిలాగ తీరింది 
ఇలాగ తీరిందీ.. మన ఋణమిలాగ తీరింది

2 comments:

  1. ఇదేచిత్రంలో "పాడితేశిలలైనకరగాలి" అనేపాటలిరిక్స్ plz

    ReplyDelete