Monday, December 10, 2012

పేరు చెప్పనా

చిత్రం: గురు (1980) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా 
నీ పేరే అనురాగం 
నీ రూపము శృంగారము 
నీ చిత్తమూ నా భాగ్యము 

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును 
నీ పేరే ఆనందం 
నీ రూపము అపురూపము 
నీ నేస్తాము నా స్వర్గము 
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా 

చరణం 1: 

పువ్వుల చెలి నవ్వొక సిరి 
దివ్వెలేలనే నీ నవ్వు లుండగా 
మమతల గని మరునికి సరి 
మల్లె లేలారా నీ మమతలుండగా 
నీ కళ్ళలో నా కలలనే పండనీ 
నీ కలలలో నన్నే నిండనీ 
మనకై భువి పై దివి నే దిగనీ 

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా 
పపపపపా పాపపపపా 

చరణం 2: 

నీవొక సెల నేనొక అలా 
నన్ను వూగనీ నీ గుండె లోపలా 
విరి శరముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా 
నీ మెప్పులు నా సొగసుకే మెరుగులు 
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులై 
మనమే వెలుగు చీకటి జతలూ 

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును 
పపపపపా పాపపపపా 

చరణం 3: 

పెదవికి సుధ ప్రేమకు వ్యధా 
అసలు అందమూ అవి కొసరు కుందమూ 
చెదరని జత చెరగని కథ 
రాసుకుందమూ పెన వేసుకుందమూ 
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము 
నీ ఉదయమూ దిన దినం మధురమూ 
ఎన్నో యుగముల యోగము మనమూ... 

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా 
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును 
నీ పేరే అనురాగం 
లాలలల లాలలల 
లాలలల లాలలల 
పపపపపా పాపపపపా

No comments:

Post a Comment