Sunday, January 20, 2013

ఓ ప్రియా... చండీప్రియా

చిత్రం: చండీప్రియ (1980)
సంగీతం: ఆదినారాయణరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల




పల్లవి :




ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించిందా
నా ప్రేమలేఖా.. నడిచే చంద్రరేఖ



ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రలేఖ




చరణం 1 :




మనసులో... ప్రతి మలుపులో.. నిను మలుచుకున్నానులే
కలలో... మధువనులలో.. నీ పిలుపు విన్నానులే

మనసులో... ప్రతి మలుపులో.. నిను మలుచుకున్నానులే
కలలో... మధువనులలో.. నీ పిలుపు విన్నానులే



ఆ.. చెలియ రూపాల చేరుకున్నావా... పలికే రాగలేఖ..
కలా?.... నిజం..
నిజం?... మ్మ్..





ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రలేఖ




చరణం 2 :
ఎవ్వతే నీ ఎవ్వాతే కలిగించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే .. కుర్పించుతావు సెగలు



ఆశను ..జీవితాశను.. నే చెదిరితే విషాదం
చండిని .. అపర చండిని నను కదిపితే ప్రమాదం


నీవు నా కైపు.. తాను నా వైపు...  అయ్యో ఏమి రాత..
అటా?... ఇటూ...
ఏటు?... ఇటూ ..




ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించిందా
నా ప్రేమలేఖా.. నడిచే చంద్రరేఖ



తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రలేఖ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9300

No comments:

Post a Comment