Wednesday, January 30, 2013

నింగికి జాబిలి అందం

చిత్రం: చెలి (2001)
సంగీతం: హరీష్ జయరాజ్
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: ఉన్నికృష్ణన్, హరిణి

పల్లవి:

నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం
నీకనుచూపులు సోకటమే ఆనందం
బొమ్మా బొరుసుల చందం విడిపోనిది మన బంధం
కమ్మని కలల గోపురమే అనుబంధం.. అనుబంధం..
ఓ ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా
మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా

ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యధో తెలియక నించున్నా
ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో

చరణం 1:

వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి
పోకే చెలియా నన్నొదిలి
నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి ఆడకె దీవాలి
చెవిలో పాడకె కవ్వాలి
మనసా మనసా నిన్నూ మదిలో దాచినదెవరో..ఓ..
నా యదలోనే ఉంటూ నన్నే దోచినవారే

వారెవరో వారెవరో వచ్చినదెందుకనో
యదలోనే యదలోనే దాగినదెందుకనో
ఎమైందో నాకే తెలియదులె
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యధో తెలియక నించున్నా
అరె తికమక పడుతున్నా..

చరణం 2:

సొగసరి గువ్వ సోగసరి గువ్వ తడబాటెందులకే తలపుల దాహం తీర్చవటే
మనసును మోహం కమ్ముకు వస్తే మౌనం వీడవటె మదనుడి సాయం కోరవటే
ఏమో ఏమో నన్నూ ఏదో చేసావులే..ఏ..
నేను నీకు చేసిందేదో నువ్వే నాకు చెసావే బొమ్మా

నీవెవరో నీవెవరో ఒచ్చినదెందుకనో
నావెనకే పడ్డావు... ఊఁహూఁహూఁ..
నేనేలే నీకోసం వచ్చా మనసారా
నా ఎదని నీకోసం పరిచా ప్రియమారా
ఎమైందో నాకే తెలియదులే నామనసు నిన్నే వీడదులే
అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనె ప్రాణసఖి
ఇది వలపు కథో వయసు వ్యధో తెలుపవే చంద్రముఖి
కథ తెలుపవే చంద్రముఖీ
కథ తెలుపవే చంద్రముఖీ
కథ తెలుపవే చంద్రముఖీ
చంద్రముఖీ చంద్రముఖీ చంద్రముఖీ..

No comments:

Post a Comment