Tuesday, January 29, 2013

చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా

చిత్రం: చీకటి వెలుగులు (1975) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: సినారె 

నేపథ్య గానం: బాలు, సుశీల 




పల్లవి : 



హే...చూశాను పొద్దంతా.... 

చూశాను పొద్దంతా.... వేచాను రాత్రంతా 


కొండపైన చిగురాకు... 

కోనలోన... నీ కోసం....ఓ..బేబి..బేబి.. 

ఓ..బేబి...బేబి...ఓ..బేబి 




చరణం 1: 



ఒక మబ్బు తునకా… నా కురుల వెనకా 

ఊగింది...చెవిలో..ఊదింది... 


ఏమనీ… బేబి బేబి ఏమనీ 


నాలాగే కమ్ముకునే… నీవాడు ఏడనీ 

అడిగింది...ఆ మబ్బు తునక 


ఒక పూలరెమ్మా.....అపరంగి బొమ్మా.... 

తగిలింది...తానే అడిగింది 


ఏమనీ… మామ్మాజీ ఏమనీ.... 

అహా...ఏమనీ...మామ్మాజీ ఏమనీ 


నా చిగురు చెంపల్లున్నా..నీ చెలియ ఏదనీ 

అడిగింది ఆ పూలరెమ్మా 



హే.. చూశాను పొద్దంతా....వేచాను రాత్రంతా 

లోయలోనా సెలయేటి పాయలోనా 

నీ కోసం మామ్మజీ.. హాజీ మామాజీ 

హాజీ మామాజీ 




చరణం 2 : 



ఆ కొండ శిఖరం.... నీలాల గగనం 

అందుకొందీ.. నాతో అంటొందీ 

ఆ కొండ శిఖరం.... నీలాల గగనం 

అందుకొందీ..నాతో అంటొందీ 


హా...ఏమనీ...మామ్మజీ.. ఏమనీ 

ఏమనీ...  ఓ బేబీ ఏమనీ 


తన లాగే మన వలపే....ఎదిగెదిగీ పోవాలనీ...

అంటుందీ ఆ కొండ శిఖరం





హే... చూశాను పొద్దంతా....వేచాను రాత్రంతా 

కొండపైన చిగురాకు... 

కోనలోన... నీ కోసం....ఓ..బేబి..బేబి.. 

ఓ..బేబి...హేయ్ హేయ్...  బేబి





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3585

No comments:

Post a Comment