Tuesday, January 29, 2013

ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా

చిత్రం: చీకటి వెలుగులు (1975)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు, సుశీల




పల్లవి :




ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా.. తక్ధీం

ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..తక ధిం..


ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా.. తక్ధీం

ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా


ఓనా మహః ఓనా మహః

శివా యహః అబ్బా... శివా యహః


నేర్చుకో కళ్ళతో.. దాచుకో గుండెలో..

చూడనీ కళ్ళలో... చేరనీ గుండెలో..


ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా..

ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..



చరణం 1:




మంచు కప్పిన.. కొండ పైనా..

మనసు తెలిసిన మనిషి తోటి కలిసీ ఉంటే......


ఏ..ఏ..ఏ..ఉన్నదేమిటి..?

ఊ..చలీ...ఆ.. 

లేనిదేమిటి...?

ఊ...గిలీ...


వుండి కూడా .. లేనిదేమిటి..?

వుండి కూడా .. లేనిదేమిటి..?

ఆ..ఆ.. కౌగిలీ.....


ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా..

ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..



చరణం 2 :



ఉరకలెత్తే పడుచుపిల్లను.. 

ఒడుపు తెలిసిచేయి వేసి.. 

పట్టుకుంటే... ఏ..ఏ..ఏ...ఏ..ఏ


ఉన్నదేమిటి...?

ఏయ్...పొగరు...
హ..హ..హ.. లేనిదేమిటి..?

ఆ.. బెదురూ..


ఉండి కూడా.. లేనిదేమిటి...?

ఉండి కూడా.. లేనిదేమిటి...?

ఆ..ఆ..ఆ కుదురూ...


ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా..

ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..



చరణం 3 :



బెదురులేని కుర్రదప్పుడు..చిగరు పెదవుల..

అదురుపాటును.. ఆపమంటే...ఏ..ఏ..ఏ..ఏ


ఆగమన్నది..?

హద్దు...

ఆగనన్నదీ...?

ఊ..ఊ.. పొద్దు...


ఆగమన్నా.. ఆగనన్నది..

ఆగమన్నా.. ఆగనన్నది..

ఆ..ఆ హా...ముద్దూ..ఊ..ఊ..ఊ


ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా.. తక్ధీం

ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా.. తక ధిం..


నేర్చుకో కళ్ళతో.. దాచుకో గుండెలో..

చూడనీ కళ్ళలో... చేరనీ గుండెలో..



No comments:

Post a Comment