Monday, January 28, 2013

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు

చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు
చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు

చూడబోతే వాడెంతో మంచివాడు
వాడికన్న వీడు మరీ కొంటేవాడు..

చరణం 1:

మల్లెపూల పడవలో..ఆ..ఆ
మంచుతెరల మాటులో..ఆ..ఆ
ఏటి నీటి పోటులా.. మాట వినని వయసులో
మల్లెపూల పడవలో మంచుతెరల మాటులో..
ఏటి నీటి పోటులా మాట వినని వయసులో

నీవే నా మురళివని పెదవి చేర్చినాడు..ఊ..
నీవే నా మురళివని పెదవి చేర్చినాడు..
ఆ పెదవిమీద తనపేరు రాసి చూసుకొన్నాడు

చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు

చరణం 2:

మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం

తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తడిసిపోయి యవ్వనం.. వెతుకుతుంది వెచ్చదనం

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు

చరణం 3:

పొన్నచెట్టు నీడలో..ఓ..ఓ..
ఎన్ని ఎన్ని ఊసులో..ఆ..ఆ..ఆ..
వెన్నముద్ద బుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
పొన్నచెట్టు నీడలో ఎన్ని ఎన్ని ఊసులో..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో

నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాగము ఈనాటి ప్రణయగీతిలో

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడు
వాడికన్న వీడుమరీ కొంటేవాడు..

No comments:

Post a Comment