Thursday, January 31, 2013

నీతోటే ఉంటాను శేషగిరిబావా

చిత్రం: జమిందారు (1966)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

నీతోటే ఉంటాను శేషగిరిబావా...
నీ మాట వింటాను మాటకారి బావా...
నీతోటే ఉంటాను శేషగిరిబావా...
నీ మాట వింటాను మాటకారి బావా...

చరణం 1:

ఒక్కదాన్నైపోయీ బిక్కుమని నేనుంటే....
వెన్నెలే నువు లేకా వెచ్చనైపోతుంటే...
ఒక్కదాన్నైపోయీ బిక్కుమని నేనుంటే....
వెన్నెలే నువు లేకా వెచ్చనైపోతుంటే...
కంటికే నిదురుందా...ఆ..కాలమే కదిలిందా...
కంటికే నిదురుందా...ఆ..కాలమే కదిలిందా...
సొగసరి బావా...గడసరి బావా....
సొగసరి బావా...గడసరి బావా....

నీతోటే ఉంటాను శేషగిరిబావా...
నీ మాట వింటాను మాటకారి బావా..

చరణం 2:

నీవు నడచిన జాడా...నాకు వెన్నెల వాడా...
నీవు నిలచిన నీడా...నాకు రవ్వల మేడా...
నీవు నడచిన జాడా...నాకు వెన్నెల వాడా...
నీవు నిలచిన నీడా...నాకు రవ్వల మేడా...
నీవు లేకుంటేను నేను లేనే లేను...
సొగసరి బావా...గడసరి బావా....
సొగసరి బావా...గడసరి బావా....

నీతోటే ఉంటాను శేషగిరిబావా...
నీ మాట వింటాను మాటకారి బావా..

చరణం 3:

కంటిపాపలలోనా కాపురం ఉంటాను...
గుండెలోనా నేను గూడు కట్టుకుంటాను...
కంటిపాపలలోనా కాపురం ఉంటాను...
గుండెలోనా నేను గూడు కట్టుకుంటాను...
నన్ను దోచినవాడా...నిన్ను దోచగలేనా...
సొగసరి బావా...గడసరి బావా....

నీతోటే ఉంటాను శేషగిరిబావా...
నీ మాట వింటాను మాటకారి బావా..

No comments:

Post a Comment