Monday, June 17, 2013

ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో

చిత్రం : జయసుధ (1980)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు


పల్లవి:

ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో

ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో

ప్రణయ గగనమున ప్రథమ రేఖవో

రేఖవో.. శశిరేఖవో.. 

సుధవో.. జయసుధవో..ఓ..

ఆ.. ఆ.. ఆ..


చరణం 1:


తరళ తరళ నీహార యవనికల మెరిసే.. సూర్య కళికా

మృదుల మృదుల నవపవన వీచికల కదిలే.. మదన లతికా... ఆ...

తరళ తరళ నీహార యవనికల మెరిసే.. సూర్య కళికా..ఆ...

మృదుల మృదుల నవ పవన వీచికల కదిలే.. మదన లతికా


నీ లలిత చరణ పల్లవ చుంబనమున పులకించును వసుధ.. 

జయసుధా.. ఆ.. ఆ.. ఆ..


ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో

ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో

ప్రణయ గగనమున ప్రథమ రేఖవో

రేఖవో.. శశిరేఖవో.. సుధవో.. జయసుధవో..ఓ..

ఆ.. ఆ.. ఆ..


చరణం 2:


శరదిందీవర చలదిందిందిర స్పురందీలకుంతలవో...

ఆ.. ఆ..

ఋష్యాశ్రమ ఘట దుష్యంత చకిత దృశ్యాంకిత  శకుంతలవో..  

ఆ.. ఆ..

అది నిటలమా.. సురుచిర శశాంక శకలమా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ..

అవి కనుబొమలా.. రతీమన్మథుల ధనువులా.. 

ఆ.. ఆ..

అది అధరమా.. ఆ..ఆ..

అమృత సదనమా.. ఆ.. ఆ..

అది గాత్రమా.. ఆ..ఆ..

జీవ చిత్రమా.. ఆ.. ఆ.. ఆ.. 


అది అధరమా.. అమృత సదనమా

అది గాత్రమా.. జీవ చిత్రమా.. ఆ.. ఆ.. ఆ..


నీ నయన లేఖినులు విరచించెను అభినవ రసమయ గాథ..

జయసుధా.. ఆ.. 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5411

No comments:

Post a Comment