Monday, June 17, 2013

కరివరద మొరను వినలేవా

చిత్రం: జాకి (1985) 
సంగీతం: బాలు 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

కరివరద మొరను వినలేవా.. శశివదన చెలిమి కనలేవా... 
నా మాటే మన్నించీ.. నాతోటే నిన్నుంచీ మన రాదా మహరాజా 
బిరానా చేరుకోరా సరాగమాడుకోరా వరించి ఏలుకో...వసంతమాడుకో.. 

కరివరద మొరను వినలేవా.. శశివదన చెలిమి కనలేవా... 

చరణం 1: 

హా.. ఆ హా.. జాజి పూలే చూసే జాలిగా.. 
హే.. ఏహే.. జంట కమ్మాన్నాయి జాలీ గా.. 
తెలుసు నా జాకీ నువ్వనీ..అహా మనసే రాజాల రవ్వనీ.. 
ఓ రాకుమారుడా.. నీ రాక కోసమే వేచి వేచి వేగుతున్నాను రా.. 


కరివరద మొరను వినలేవా..శశివదన చెలిమి కనలేవా... 
నా మాటే మన్నించీ.. నాతోటే నిన్నుంచీ మన రాదా మహరాజా 
బిరానా చేరుకోరా సరాగమాడుకోరా వరించి ఏలుకో...వసంతమాడుకో.. 

చరణం 2: 

హా..ఆ హా.. ఎందుకో నువ్వంటే ఇది ఇది గా... 
హే.. ఏ హే.. అందుకే నీ తోడు నేనడిగా... 
చెంగు ఎన్నటికీ వదలకూ.. ఏయ్ చెలిమి ఎప్పటికీ విడవకూ.. 
ఓ ఈశ్వర శాపమా.. ఓ హో నా ప్రియతమా పేచీ మాని రాజీకొచ్చేయరా... 

హయగమన మొరలు వినలేనా.. శశివదన మనసు కనలేనా... 
నన్నల్లే నిన్నెంచీ.. నాలోనే నిన్నుంచీ 
వలచానే... వల రాణి 
బిరాన చేరుకోనా.. సరాగమాడుకోనా.. వరించి ఏలనా..ఓ ఓ ఓ..వసంతమాడనా 
లలాలలాలలాలలాలలాలలా

No comments:

Post a Comment